
ప్రజాశక్తి-కాకినాడ : యుటిఎఫ్ 49 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ... కాకినాడ జిల్లా యుటిఎఫ్ హోం వద్ద యుటిఎఫ్ జెండాను రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర వర్మ బుధవారం ఆవిష్కరించారు. ముందుగా జాతీయ జెండాను సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ ఆడిట్ కమిటీ కన్వీనర్ సత్తిరాజు ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నగేష్ అధ్యక్షత వహించారు. స్వీట్ పంచి పెట్టారు. యుటిఎఫ్ పతాక గేయాన్ని అధ్యక్షులు అన్నారాం పాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, అసోసియేట్ అధ్యక్షుడు ఐ.ప్రసాదరావు, బి.నాగమణి, గోవిందరాజులు, త్రిమూర్తులు, వి.మహేష్, తదితరులు పాల్గొన్నారు.