May 26,2023 12:07

అమరావతి : నేడు ఎండ, వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. నేడు 84 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి మాట్లాడుతూ ... పలు చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా.. వఅద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.

                                                 నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు..

అనకాపల్లి 1, బాపట్ల 6, తూర్పుగోదావరి 5, ఏలూరు 4, గుంటూరు 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం
కాకినాడ 11, కోనసీమ 1, కృష్ణా 13, ఎన్టీఆర్‌ 15, పల్నాడు జిల్లాలోని 11 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం

ఈరోజు అల్లూరి , కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ - 46 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 - 44 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, ఎస్‌పిఎస్‌ఆర్‌, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 - 44 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38 - 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

నిన్న కృష్ణా జిల్లా నందివాడలో, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 44.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌లు నమోదయ్యిందని అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో 44.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌లు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 44.3 డిగ్రీల సెంటీగ్రేడ్‌లు నమోదయ్యాయని వెల్లడించారు.