Jan 30,2023 21:43

గూర్‌గావ్‌ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ ఫిబ్రవరి 1న తన నూతన గెలాక్సీ ఎస్‌ సిరీస్‌ ఫోన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సౌత్‌ కొరియన్‌కు చెందిన ఈ కంపెనీ గెలాక్సీ ఎస్‌23 సీరిస్‌ను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. గెలాక్సీలో ఈ సీరిస్‌ కొత్త ఇన్నోవేషన్‌ అని సామ్‌సంగ్‌ ఎంఎక్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ టిఎం రోV్‌ా పేర్కొన్నారు. ఇది తమ నిబద్దతను రెట్టింపు చేయనుందన్నారు. ఇందులో గెలాక్సీ23, గెలాక్సీ 23 ఫ్లస్‌, గెలాక్సీ 23 అల్ట్రాలను ప్రవేశపెట్టనున్నామన్నారు.