Aug 05,2022 21:12

సెమీస్‌లో నేడు ఇంగ్లండ్‌తో డీ
మ.3.30గం||ల నుంచి సోనీలో

బర్మింగ్‌హామ్‌: భారత మహిళజట్టు నేడు కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో భారతజట్టు ఇంగ్లండ్‌తో పోటీపడనుంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ గాయం కారణంగా కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ''ఇంగ్లండ్‌ మహిళల జట్టు కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ గాయం కారణంగా కామన్వెల్త్‌ గేమ్స్‌, ది హండ్రెడ్‌ లీగ్‌కు దూరం కానుంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాయపడ్డ నైట్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆమె ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అదే విధంగా మిగతా మ్యాచ్‌లకు కూడా నాట్‌ స్కివర్‌ కెప్టెన్‌గా కొనసాగనుంది'' అని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌లో పేర్కొంది. రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 10.30గం||లకు జరగనుంది.
టైటిల్‌పై టీమిండియా గురి
వెస్టిండీస్‌తో ఐదు టి20ల సిరీస్‌లో 2ా1 ఆధిక్యతో ఉన్న టీమిండియా నేడు నాల్గో మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ ఐదో టి20తో నిమిత్తం లేకుండా సిరీస్‌ను చేజిక్కించుకోనుంది. ఈ పర్యటన అనంతరం ఆసియాకప్‌ ఉన్న దృష్ట్యా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌లపైనే ప్రధాన దృష్టి నెలకొంది. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఆ సిరీస్‌కు చోటు దక్కే ఛాన్స్‌ ఉంది.