Jun 02,2023 10:13

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 28 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. వెయిటింగ్‌లో వున్న జి రవిని తాడిపత్రి మున్సిపల్‌ కమిషనరుగా, టి రాంభూపాల్‌రెడ్డిని హిందూపురం అసిస్టెంట్‌ కమిషనరుగా, డి లక్ష్మిని బొబ్బిలి నుంచి జివిఎంసి ప్రాజెక్టు ఆఫీసర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. కావలి కమిషనరు బి శివారెడ్డిని మంగళగిరి కార్పొరేషన్‌కు డిప్యూటీ కమిషనరుగా, ధర్మవరం కమిషనరు వి మల్లికార్జునను గుంటకల్‌కు, శ్రీకాకుళం సెక్రటరీ బి రావమ్మను జివిఎంసి ప్రాజెక్టు ఆఫీసర్‌గా వేశారు. పిఠాపురం కమిషనరు ఎం రామ్‌మోహన్‌ను నరసరావుపేట కమిషనరుగా, సిడిఎంఎ అసిస్టెంట్‌ డైరెక్టరు కృష్ణవేణిని పిఠాపురం కమిషనరుగా, మచిలీపట్నం అసిస్టెంట్‌ కమిషనరు కె అనూషను తెనాలి అసిస్టెంటు కమిషనరుగా, సిడిఎంఎ అసిస్టెంట్‌ డైరెక్టరు జి శేఖర్‌ను చిలకలూరిపేట కమిషనరుగా, తెనాలి అసిస్టెంట్‌ కమిషనరు గోపాల్‌రావును తాడేపల్లిగూడెం అసిస్టెంట్‌ కమిషనరుగా, ధర్మవరం మున్సిపల్‌ కమిషనరుగా బి శేషన్నను నియమించారు. గుంటూరు కార్పొరేషన్‌కు ప్రాజెక్టు ఆఫీసర్‌గా డి రవీంద్రను, సామర్లకోట కమిషనరు సిఎంఎ నయీమ్‌ను పొన్నూరు కమిషనరుగా, సిడిఎంఎ నుంచి ఎ శ్రీవిద్యను కాకినాడకు, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎ సామేల్‌ను తాడేపల్లిగూడెం కమిషనరుగా, పొన్నూరు కమిషనరు ఎన్‌ రాధను ఏలూరు డిప్యూటీ కమిషనరుగా వేశారు. అలాగే కె వెంకటేశ్వరరావును సిడిఎంఎలో రిపోర్ట్‌ చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. వినుకొండ కమిషనరు బి శ్రీనివాసులును అద్దంకి కమిషనరుగా, స్టేట్‌ ఆడిట్‌ ఆఫీస్‌ నుంచి కిరణ్‌ను కావలి కమిషనరుగా, తాడిగడప మున్సిపాలిటీలో అసిస్టెంట్‌ కమిషనరుగా వున్న కె అభినేష్‌ను సొంతశాఖ అయిన పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌కు పంపారు. అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనరు ఎస్‌ఎన్‌ లావణ్యను గుంటకల్‌ అసిస్టెంట్‌ కమిషనరుగా, షేక్‌ మాలిక్‌ను కర్నూలు అసిస్టెంట్‌ కమిషనరుగా, గుంటూరు కార్పొరేషన్‌లో శానిటరి ఇన్‌స్పెక్టరుగా వున్న జె రామారావును సామర్లకోటకు కమిషనరుగా వేశారు. ఏలూరు శానిటరి ఇన్‌స్పెక్టరు బి మహేంద్రను సిడిఎంఎకు బదిలీ చేశారు. అలాగే జిల్లా కో-ఆపరేటివ్‌ అధికారి బి సన్యాసినాయుడును జివిఎంసి ప్రాజెక్టు అధికారిగా, పుట్టపర్తి కమిషనరు ఆర్‌ వెంకటరామిరెడ్డిని డోన్‌ కమిషనరుగా, డోన్‌ కమిషనరు ఎం వెంకటేశ్వర్లును సిడిఎంఎకు బదిలీ చేశారు.