Jul 03,2022 13:40

ప్రజాశక్తి-చింతూరు : అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా చింతూరులో సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం పాల్గొన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రాహానికి పూలమాలవేసిన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్‌ అల్లూరి సీతారామరాజు అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.