
శాన్ప్రాన్సిస్కో : ట్విటర్‌ను ఎలన్ మస్క్ స్వాధీనం చేసుకోకముందు సాఫీగా సాగిన సంస్థ కార్యకలాపాలు ఇప్పుడు రోజుకో సమస్యను ఎదుర్కొంటుంది. తాజాగా అద్దె చెల్లించలేని దుస్థితికి చేరడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని స్పష్టమవుతోంది. శాన్ఫ్రాన్సిస్కోలోని 1355 మార్కెట్ స్ట్రీట్‌లోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయ అద్దెను చెల్లించలేకపోతోంది. 4,60,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. దీనికి డిసెంబరు నెలకుగానూ 3.36 మిలియన్ డాలర్లు, జనవరి నెలకు 3.42 మిలియన్ డాలర్ల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంది. కాగా.. అద్దె చెల్లింపుల్లో ఈ సంస్థ విఫలమైంది. దీంతో ఆ భవన యాజమాని శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ ఎల్ఎల్సి సోమవారం కోర్టులో కేసు వేశారు. ఇతర దేశాల్లోనూ అద్దెలు చెల్లించడానికి ఎలన్ మస్క్ నిరాకరిస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి.