Oct 03,2022 20:41

జెరూసలేం : పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ సైనికుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఇజ్రాయిల్‌ దళాల చేతిలో ఇద్దరు పాలస్తీనీయుల మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్‌ వెస్ట్‌ బ్యాంక్‌ సిటీలోని జలజోన్‌ శరణార్థుల శిబిరంపై దాడికి పాల్పడిన ఇజ్రాయిల్‌ సైనికులు ఆ తరువాత శిబిరానికి సమీపంలో ఉన్న ఒక పాలస్తీనా వాహనంపై ఎలాంటి కారణం లేకుండానే కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలతో పాటు, గాయపడిన వ్యక్తిని కూడా ఇజ్రాయిల్‌ సైనికులు తీసుకుని వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.