Aug 09,2022 22:05

ఉజ్జెబకిస్తాన్‌కు స్వర్ణం, టాప్‌లో ఉక్రెయిన్‌ మహిళల జట్టు
ముగిసిన 44వ చెస్‌ ఒలింపియాడ్‌

చెన్నై: 44వ చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలు మంగళవారంతో ముగిసాయి. మొత్తం 11రౌండ్ల పోటీలు ముగిసిన అనంతరం ఇండియాాఏ జట్టు ఓపెన్‌ మరియు మహిళల విభాగంలో కాంస్య పతకం సాధించింది. పురుషుల విభాగంలో ఉబ్జెకిస్తాన్‌ జట్టు స్వర్ణ పతకం సాధించింది. చివరి రోజు జరిగిన పోటీలో ఉజ్బెక్‌ గ్రాండ్‌మాస్టర్‌ నెదర్లాండ్స్‌కు చెందిన అనీస్‌ గిరిపై గెలుపొందాడు. దీంతో ఆ జట్టు 2.5-1.5పాయింట్ల తేడాతో విజయం సాధించి టాప్‌లో నిలిచింది. ఇక ఇండియాాబి జట్టు 3-1తో జర్మనీని ఓడించి కాంస్య పతకం కైవసం చేసుకుంది. మహిళల విభాగంలో హంపి నేతృత్వంలోని ఇండియాాబి 1-3పాయింట్ల తేడాతో అమెరికా చేతిలో ఓడింది. దీంతో అమెరికాకు రజత పతకం లభించగా.. హంపి, తానియ, వైశాలి, భారతిలకు కాంస్య పతకాలు దక్కాయి.