Aug 10,2022 09:35

మడకశిర (అనంతపురం) : ప్రమాదవశాత్తూ బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన బుధవారం గుడిబండ మండల గుడిదల్లిలో చోటుచేసుకుంది. భరత్‌, హరి అనే అన్నదమ్ములు పశువులను మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందారని ఆ గ్రామ ప్రజలు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.