Oct 05,2022 17:31

ప్రజాశక్తి - మాచవరం (గుంటూరు) : పిడుగు పాటుకు ఇరువురు మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన పిడుగుపడి మహంకాళి చంద్రశేఖర్‌ (42) అక్కడిక్కడే మృతి చెందాడు. సమీపంలోని బంధువులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనం ద్వారా పిడుగురాళ్ల వైద్యశాలకు తరలించారు మతుడు చంద్రశేఖర్‌కి భార్య పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్‌ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచేరుకురు మండలం, చమళ్లముడి గ్రామంలో పిడుగు పాటుకు రైతు కూలీ రాయపాటి యలమంద మతి చెందాడు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.