Aug 19,2022 07:49

అమెరికాలోని కాలిఫోర్నియాలో గురువారం రెండు చిన్న విమానాలు గాలిలోనే ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ''వాట్సన్‌విల్లే మున్సిపల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కావడానికి ప్రయత్నించిన రెండు విమానాలు ఢీకొన్న తర్వాత కూలిపోయాయి. ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది'' అని నగర అధికారులు ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేసిన ప్రకటనలో తెలిపారు.