Jun 28,2022 07:48

ప్రజాశక్తి-చాపాడు (కడప) : రోడ్డు దాటుతుండగా ఆటో  ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయిన ఘటన మంగళవారం మైదుకూరు-ప్రొద్దుటూరు ప్రధాన రహదారిపై జరిగింది. కావలి కొత్తసత్రానికి చెందిన ఆరుగురు గోవాకు కారులో బయలుదేరారు. కాలకృత్యాల కోసం ఏటూరు కాలువ వద్ద కారు ఆపి రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టింది. ఈ సంఘటనలో వినయ్ కుమార్‌, అశోక్‌ కుమార్‌ లకు బలమైన గాయాలయ్యాయి. వీరిని 108 లో పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాపాడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.