
సంఘీభావంతో సాయమందించాలని పిలుపు
ఐక్యరాజ్య సమితి : ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం సంభవించిన పెను విషాదం పట్ల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ విచారం వ్యక్తం చేశారు. వందలాదిమంది మరణించారు, గాయపడ్డారని, వీరి సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. ఏళ్ళ తరబడి ఘర్షణలు, ఆర్ధిక ఇబ్బందులు, ఆకలి సమస్యలతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ ప్రజానీకంపై ప్రకృతి కూడా పగబట్టిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. బాధిత ప్రాంతాలకు ఐక్యరాజ్య సమితి బృందాలు వెళ్లాయని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. ఆఫ్ఘన్‌కు చేయూతను అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని, ఇంది సంఘీభావంతో ముందుకు సాగాల్సిన సమయమని వ్యాఖ్యానించారు.