
కోయిల కమ్మగ కూసింది
వసంత ఋతువు వచ్చింది
ఫాల్గుణ మాసం వెళ్ళింది
ఉగాది పండుగ వచ్చింది
అమ్మ వేపపూత తెచ్చింది
మామిడి పిందెలు కోసింది
చెరకు తీపిని వేసింది
మిరియపు కారం చల్లింది
చింతపండును పిండింది
ఉప్పును బాగా కలిపింది
షడ్రుచుల పచ్చడి చేసింది
ఇంటిల్లిపాదికి పంచింది
మనం తినే ఆరు రుచులు
మనిషి జీవిత సుఖద్ణుఖాలు
ఎదురయ్యే ఎగుడుదిగుడులు
మంచి చెడ్డల ప్రతిబింబాలు
తినే ఒక్కొక్క రుచికి
ఒక్కో ఆరోగ్య సూత్రం..!
- ఆవుల చక్రపాణి యాదవ్
99633 50973