Jun 02,2023 09:44

స్టాన్‌ఫర్డ్‌ : తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తారని ఊహించలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. అయితే అది తనకు ఓ పెద్ద అవకాశాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఆయన ఆహుతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పరువునష్టం కేసులో అనర్హత వేటుకు గురై గరిష్ట శిక్ష విధించబడిన మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. ఇలాంటిది జరుగుతుందని తాను ఊహించలేదని తెలిపారు. 'అయితే ఈ శిక్ష నిజానికి నాకు ఓ పెద్ద అవకాశం ఇచ్చిందని భావించాను. నేను పార్లమెంటులో ఉన్న దాని కంటే మరింత పెద్ద అవకాశం' అని ఆయన చెప్పారు.