May 23,2023 21:22

ప్రజాశక్తి-ఉయ్యూరు (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ కార్మికుడు జొన్న సాంబశివరావు (63) మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు. ఉదయం ఉపాధి పని చేసిన అనంతరం పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుని సేద తీరుతూ కుప్పకూలిపోయారు. తోటి కార్మికులు ఆయనను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సాంబశివరావు మృతదేహాన్ని ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ఎపిడి నాంచారయ్య, ఎంపిడిఒ విమాదేవి, తహశీల్దార్‌ మస్తాన్‌ సందర్శించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.