Oct 05,2022 17:47

ప్రజాశక్తి-పలాస (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం కంబిరిగాం వరహాల గెడ్డలో కేదారిపురం గ్రామానికి చెందిన పాడి శంకర్‌, బోడసింగి కూర్మారావు బుధవారం సాయంత్రం గల్లంతయ్యారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరహాల గెడ్డ ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో వీరు స్నానాలకు దిగగా వరద ప్రవాహానికి ఒక్కసారిగా కొట్టుకుపోయారు. అక్కడ ఉన్న గ్రామస్తులు, తోటి స్నేహితులు వారిని కాపాడేందుకు ప్రయత్నం చేసిన ఫలించలేదు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ సిఐ శంకర్రావు, పలాస తహశీల్దార్‌ ఎల్‌.మధుసూదన్‌రావు గెడ్డ వద్దకు చేరుకున్నారు. జరిగిన ఘటనను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. గజా ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చెపట్టారు. విషయం తెలుసుకున్న డిఎస్‌పి కాశీబుగ్గ శివరామిరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.