Oct 05,2022 17:13

ప్రజాశక్తి-నరసరావుపేట (పల్నాడు) : పల్నాడు జిల్లా ఎస్‌పి రవి శంకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో వాహనాలకు, ఆయుధలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే ఈ దసరా పండుగ అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు బిందుమాధవ్‌ రామచంద్రరాజు(ఏఆర్‌), ఏఆర్‌ డిఎస్పీ చిన్నికష్ణ, నరసరావుపేట రూరల్‌ సీఐ భక్తవత్సల రెడ్డి, ఆర్‌ఐలు రమణ రెడ్డి, ప్రేమ్‌ కుమార్‌, రవికిరణ్‌, వెంకట రమణ, ఇతర పోలీస్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

puja