Oct 05,2022 18:58

ప్రజాశక్తి - బాపట్ల : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఒంగోలులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీసు ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వహించారు. చెడుపై విజయానికి ప్రతీకగా జరుపుకునేదే విజయదశమి అని జిల్లా ఎస్‌పిలు మలికగర్గ్‌ , వకుల్‌ జిందాల్‌ తెలిపారు. రెండు జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బంది మరియు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పి (అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు, ఎఆర్‌ ఎస్‌పి అశోక్‌ బాబు, డిఎస్‌పి బి.మరియదాసు, ఒంగోలు డిఎస్పీ యు.నాగరాజు, ఐసిసిఆర్‌ ఇన్స్పెక్టర్‌ కె.వి.రాఘవేంద్ర, డిసిఆర్‌బి ఇన్స్పెక్టర్‌ యన్‌.శ్రీకాంత్‌ బాబు, ఆర్‌ఐలు హరి బాబు, శ్రీ హరి రెడ్డి, ఎస్‌కె.మౌలిద్ధిన్‌, శ్రీకాంత్‌ నాయక్‌, ఐటి కోర్‌ ఎస్సై అజరు కుమార్‌, లీగల్‌ అడ్వైజర్‌ వేణు గోపాల్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.