Jul 03,2022 15:57

శ్రీనగర్‌ :  ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్తులు బంధించి పోలీసులకు అప్పగించిన ఘటన జమ్ముకాశ్మీర్‌లో జరిగింది. రెయిసీ జిల్లాలోని టక్సన్‌ గ్రామంలో ఆదివారం ఉదయం ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను గ్రామస్తులు బంధించారు. రాజౌరీ జిల్లాకు చెందిన లష్కరే కమాండర్‌ తాలిబ్‌ హుస్సేన్‌ వీరిలో ఉన్నాడు. ఇటీవల రాజౌరీ జిల్లాలో జరిగిన ఐఇడి పేలుళ్లలో ఇతడి పాత్ర ఉంది. మరో ఉగ్రవాది ఫైజల్‌ అహ్మద్‌ దార్‌ దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందినవాడు. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఇతని పేరు ఉన్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. వీరితో పాటు రెండు ఏకే రైఫిల్స్‌, ఏడు గ్రనేడ్‌లు, పిస్తోల్‌ను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం పోలీసుకు అప్పగించారు. టక్సన్‌ గ్రామస్తులకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తుల ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ అదపు డిజిపి రూ.2 లక్షల బహుమానాన్ని ప్రకటించారు. అలాగే రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా మరో రూ.5 లక్షలను బహుమతిగా ప్రకటించినట్లు మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఎడిజిపి జమ్ము ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.