May 26,2023 17:18

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ఖాన్‌, విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌ వంటి ప్రముఖ తారాగణం ఐఫా (ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ) అవార్డ్‌ వేడుకకు తరలి వెళుతున్నారు. ఈ వేడుక మే 27న అబుదాబిలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఫారాక్‌ఖాన్‌ కుందర్‌, రాజ్‌ కుమార్‌ రావులు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌కు ఎయిర్‌పోర్టులో ఓ చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో అభిమానితో విక్కీ సెల్ఫీ దిగుతుండగా.. అప్పుడు సల్మాన్‌ ఎంటర్‌ అవుతాడు. దీంతో సల్మాన్‌ భద్రతా సిబ్బంది విక్కీని పక్కకునెడుతూ ముందుకువెతారు. అయినప్పటికీ విక్కీ.. సల్మాన్‌ షేక్‌హ్యాండ్‌ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ సెక్యూరిటీ గార్డ్స్‌ విక్కీకి అడ్డుగా నిలబడతారు. విక్కీ.. సల్మాన్‌ ఒకరినొకరు అదోలా చూసుకుంటూ ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
కాగా, ఐఫా అవార్డ్స్‌ వేడుకలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నోరా ఫతేమి, సునిధి చౌహాన్‌, బాద్షా వంటి తదితర తారాగణం పాల్గొననున్నారు.