Sep 22,2022 15:06

విశాఖ:విశాఖ అడ్డాగా గంజాయి. డ్రగ్స్‌ మాఫియా జరగుతోందని, గంజాయి ఎగుమతులలో వైసిపి నాయకుల హస్తం ఉందని విశాఖ టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న విశాఖపట్టణం ఇప్పుడు హత్యలకు, భూ ఆక్రమణలకు నిలయంగా మారిందన్నారు. వైసిపి ప్రభుత్వం అమ్ముతున్న కల్తీ మద్యం తాగి అనేక మంది చనిపోతున్నారన్నారు. విశాఖ.. గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోందన్నారు. పోలీసులు కూడా వైసిపి నాయకులు చెప్పిందే చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖకు సీఎం జగన్‌ వచ్చినా... శాంతిభద్రతల కట్టడి అయ్యే పరిస్థితి కనబడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.