
లండన్ : మంకీపాక్స్‌ను అంతర్జాతీయంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించే అవకాశం వుందా లేదా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) పరిశీలిస్తోంది. ఇందుకు గానూ గురువారం ఎమర్జన్సీ కమిటీ సమావేశమైంది. అయితే, మంకీపాక్స్‌ను అంతర్జాతీయంగా ఎమర్జన్సీగా ప్రకటిస్తే ఎక్కడ ఈ వ్యాధి తలెత్తినా దాన్ని అసాధారణ సంఘటనగా చూడాల్సి వుంటుంది. కోవిడ్ మహమ్మారి విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేశారో మంకీపాక్స్ విషయంలో కూడా ఆ తరహాలోనే ఆదేశాలు జారీ చేయాల్సి వుంటుంది. ఈ వ్యాధి కూడా మరినిు చోట్లకు విస్తరించే ముప్పు పొంచి వుంది. అయితే ఇటువంటి ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదని అనేక మంది నిపుణులు భావిస్తునాురు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఎక్కడైతే కేసులు తలెత్తాయో అక్కడ చురుకుగా కదిలి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. 40కి పైగా దేశాల్లో ప్రధానంగా యూరప్‌లోనే మంకీపాక్స్‌ను గుర్తించామని గత వారమే డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ప్రకటించారు. మంకీపాక్స్ ఆఫ్రికాలో దశాబ్దాల తరబడి ప్రజలను రోగగ్రస్తులను చేసింది. అక్కడ 10 శాతం మంది ఈ వ్యాధి బారిన పడి మరణించారు. అయితే ఆఫ్రికా దాటితే ఈ వ్యాధితో మరణాలు ఎక్కడా నమోదు కాలేదు. మంకీపాక్స్ విస్తరిస్తుందనే డబ్ల్యుహెచ్ఓ ఆందోళన చెందుతునుట్లైతే ఈ పనిఎప్పుడో 2017లోనే చేయాల్సిందని ఇప్పుడు కాదనినైజీరియా వైరాలిజిస్ట్ వ్యాఖ్యానించారు.