Oct 05,2022 12:03

ఎన్‌టిఆర్‌ : విజయదశమి రోజున హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ ... శరన్నవరాత్రులలో ఈ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనం చేసుకున్నాను అని అన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు భక్తులపై ఉండాలని కోరుకున్నానని చెప్పారు. రాష్ట్రాభివృద్ది జరిగి, ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను అని అన్నారు. మానవ శాంతి ఉంటే ప్రపంచ కల్యాణం జరుగుతుందని తెలిపారు. చెడు మీద మంచి, అధర్మము మీద ధర్మం గెలిచిన రోజు కాబట్టి ఈ రోజు ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తుందని, విజయదశమి రోజు కాబట్టి అన్‌స్టాపబుల్‌ కోసం ఇక్కడికి వచ్చానని బాలయ్య పేర్కొన్నారు.