Sep 15,2023 12:57

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటి రష్మిక మందన్నా 'పుష్ప' చిత్రంతో బాగా పాపులర్‌ అయింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న 'పుష్ప 2' చిత్రంలో రష్మిక నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' చిత్రంలో నటనకుగానూ.. హీరో అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. దీంతో 'పుష్ప 2' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. హీరోయిన్‌ రష్మిక తాను నటించే చిత్రంలో తన పాత్రకు న్యాయం చేసేందుకు జిమ్‌లో తెగ కష్టపడుతోంది. చెమటల్ని చిందిస్తూ.. కాళ్లపై బరువుల్ని మోస్తున్న వీడియోను రష్మిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.