Aug 03,2022 18:20

ఇంటర్నెట్‌డెస్క్‌ : అతివేగం ప్రమాదకరం అని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నా.. కొందరు పట్టించుకోకుండా హైస్పీడ్‌తో బైక్‌ని నడుపుతుంటారు. ఇలా హై స్పీడ్‌తో బైక్‌ నడపడం వల్ల వారు ప్రమాదానికి గురికావడమే కాకుండా.. రోడ్డుపై వెళ్తున్న మిగతావారిని కూడా ప్రమాదాలకు గురిచేస్తారు. ఇలాంటి ప్రమాదాల్ని నివారించడానికే ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ట్విట్టర్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో రోడ్డుపై ఓ వ్యక్తి బైక్‌ని హైస్పీడ్‌తో ర్యాష్‌గా నడుపుకుంటూ వెళ్తుండటం కనిపిస్తుంది. అలాగే ఈ వీడియోలో మేరీ మర్జీ అనే హిందీసాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. అంతలోనే.. వాహనాల్ని దాటకుంటూ.. ఇంకొంచెం స్పీడ్‌ పెంచి బైక్‌ నడుపుతున్న వ్యక్తి సడెన్‌గా బ్యాలెన్స్‌ తప్పి కిందపడిపోతాడు. అలా బైక్‌పై నుంచి కిందపడిపోయే క్రమంలో.. రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ సైలెన్స్‌ర్‌ని అతని తల ఢకొీట్టుకుని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. బైక్‌ నడిపిన వ్యక్తి హెల్మెట్‌ ధరించం వల్ల ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడతాడు. అతను నడిపిన బైక్‌ మాత్రం కొన్ని మీటర్ల దూరం వెళ్లి ఆగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియో చివర్లో.. బైక్‌ స్టంట్స్‌.. ప్రాణాలకు ముప్పు అనే హెచ్చరిక సూచిస్తుంది. ఈ వీడియోను పోస్టు చేసిన అరగంటలోనే 1300 నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. స్పీడ్‌ థ్రిల్‌కి గురిచేసినా.. చంపేస్తుంది అని ఓ నెటిజన్‌ వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్‌ అయితే.. ప్రమాదాల్ని నివారించడానికే స్పీడ్‌గా రైడ్‌ చేసేవారికి పోలీసులు జరిమానా విధిస్తారు. ఈ వీడియోను చూసైనా.. బైక్‌ స్టంట్స్‌ చేయకండి అంటూ కామెంట్‌ చేశారు.