Sep 22,2022 16:09

లక్నో : హెల్మెట్‌ పెట్టుకుంటే.. గాలి తగలక బైకర్స్‌ చాలా ఇబ్బందులు పడుతుంటారు. అదే..గాలి తగిలే హెల్మెట్‌ ఉంటే ఎంత బాగుంటుందో కదూ..! సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే ఓ బాబాజీ ఫ్యాన్‌ హెల్మెట్‌ని ఆవిష్కరించాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ బాబాజీ ఫ్యాన్‌తో కూడిన హెల్మెట్‌ని ధరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ ఫ్యాన్‌ హెల్మెట్‌ని ధరించి రోడ్డుపై నడుస్తుంటే.. ఓ పాదచారుడు 'మీరు ధరించిన హెల్మెట్‌ వింతగా ఉంది' అని ఆ బాబాజీని గాడు. దీనికి ఆ బాబాజీ.. 'రోజూ భిక్షాటన చేస్తూ..చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. ఎండవేడికి తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఒక హెల్మెట్‌కి ఫ్యాన్‌, సోలార్‌ ప్లేట్‌ అమర్చి తలకు పెట్టుకున్నాను. ఇది తలపాగ మాదిరిగానూ ఉంది. ఎంతటి ఎండలోనైనా.. చల్లటి గాలినిస్తుంది. దీన్ని తలకు పెట్టుకోవడం వల్ల.. ఎంతో హాయిగా ఉంది' అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.