Mar 22,2023 08:53

మా కలలకు ఆకృతి నీయ,
మా వెతలకు పరిష్కృతి చూప,
మా ఆశల సఫలీకృతము సేయ
మా భవితకు శోభాలంకృతిగా
సాక్షాత్కరించిన బహుమతిగా
అరుదెంచిన శుభకృతునకు
మనస్ఫూర్వక నమస్కృతులివే
మంగళకర జయధ్వానాలివే.
శుభకృతు వత్సరమంతా
వసంత ఋతువై సాగాలి
ప్రకృతి మాత కటాక్షంతో
సంక్షేమం విరబూయాలి
జనులంతా ఏకీకృతమై
మమతా శిఖరంగా ఎదగాలి
మానవతకు అనుకృతిగా
మన సంస్కృతి పరిమళించాలి
ఘన చరితను రచించాలి.
 

- డా.డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.