Sep 23,2022 07:54

అప్పులు, సబ్సిడీ, గ్రారట్లతో సహా
ఆడిట్‌ కోసం లేఖ రాసిన ఎజి ఆఫీస్‌
సంస్థల్లో ఎస్‌డిసి, ఫైనాన్షియల్‌ కార్పొరేషన్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి :ఆడిట్‌ నివేదికల రూపకల్పనపై కాగ్‌ పరిధిలోని ఎజి కార్యాలయం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా ఆర్ధిక లావాదేవీలతో ముడిపడి ఉన్న సంస్థల వివరాలు చెప్పడం లేదంటూ ఆక్షేపిరచింది. సంస్థల రుణాలు, సబ్సిడీ   గ్రాంట్లు వంటి వివరాలతో వివరాలు చెప్పకపోతే ఎస్‌ఎఫ్‌ఎఆర్‌ (స్టేట్‌ ఫైనాన్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌) తయారు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
ప్రభుత్వ రంగంలో కీలకంగా ఆర్ధిక లావాదేవీలు ఉన్న రాష్ట్ర అభివృద్ధి సంస్థ, ఎపి స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌, ఎపి సేంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌-సర్వీసెస్‌, ఎపి జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేన్‌ల వివరాలను సమర్పించాలని లేఖలో పేర్కొంది. 15 రోజుల్లోగా వీటి వివరాలు కావాలని గడువు నిర్దేశించింది. ప్రతియేటా వార్షిక ఆడిట్‌ నివేదికలు సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఆర్ధిక నుంచి వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్‌లో పొరదుపరిచిన అంశాలు, ఆయా సంస్థలకు ఇచ్చిన నిధులు, సంస్థల ద్వారా తీసుకున్న రుణాలు, వాటిని ఖర్చు చేసిన విధానం వంటి అంశాలు ఎజి కార్యాలయానికి సమర్పిరచాల్సి ఉంటుంది. అయితే కొద్ది కాలంగా ఈ వివరాలు సకాలంలో, సంపూర్ణంగా ఎజి కార్యాలయానికి అందడం లేదు. ఈ నేపథ్యంలోనే గత జూలై 14న కూడా ఎజి కార్యాలయం నుంచి రాష్ట్ర ఆర్ధికశాఖకు లేఖ అందింది. అయినా అధికారులు స్పందించకపోవడంతో ఈ నెల 16వ తేదీన అవే అంశాలతో మరోసారి లేఖ రాసింది. ఆయా సంస్థలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను కూడా అందించాలని లేఖలో పునరుద్ఘాటించింది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సంస్థల వివరాలు ఎజి కార్యాలయానికి పంపిరచినప్పటికీ, అత్యంత కీలకమైన రాష్ట్రాభివృద్ధి సంస్థ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ వంటి వాటి వివరాలు మాత్రం పంపించకపోవడం గమనార్హం. ఈ రెండు సంస్థల ద్వారా జరిగిన లావాదేవీలే 40 నుంచి 50 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.