
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పోలవరం ప్రాజెక్టులో పునరావాసం పనులకు సమస్యలు తొలగిపోవడం లేదు. నిధుల లేమితో పునరావాస కాలనీల పనులు అరకొరగానే జరుగుతున్నాయి. ఇప్పటికే చేసిన వాటికి నిధులు రాకపోవడంతో మిగిలిన పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రూ.160 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని వెంటనే ఇవ్వకపోతే మిగిలిన పనులు చేయడం సాధ్యం కాదని కాంట్రాక్టర్ల తరపున రాష్ట్ర బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తేల్చిచెబుతోంది.నిధులు విడుదల చేయాలని పలు దఫాలు కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి, ఆర్థికశాఖకు లేఖలు రాసినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. తమకు మొత్తం రూ.160 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని వారు పదేపదే కోరారు. 78 పునరావాస కాలనీలకు సంబంధిరచిన బిల్లులు ఇరకా ఆర్థికశాఖ వద్దనే పెరడిరగ్‌లో ఉన్నాయి. ఈ కాలనీల్లో మొత్తం పనులు పూర్తయితే తప్ప నిర్వాసితులకు ఇళ్లు అప్పగించే అవకాశాలు కూడా లేవని అధికారులు అంగీకరిస్తున్నారు.
- పాత ధరలకే ఎలా...
ఇప్పటివరకు జరిగిన పనులను 2015-16, 2016-17 షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్‌ఒఆర్) మేరకే చేస్తున్నామని, ప్రస్తుతం 2022-23 ఎస్‌ఒఆర్ అమలులో ఉన్నప్పటికీ, తమకు ఆ రేట్లు వర్తించడం లేదని కారట్రాక్టర్లు వాపోతున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోతున్నట్లు చెబుతున్నారు. జాతీయ హోదా కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్లు చరుగ్గా పాల్గొంటున్నప్పటికీ, ప్రభుత్వం తరపున నిధుల విడుదల లేకపోవడంతో కాంట్రాక్టర్లు నిరుత్సాహపడుతున్నారు. తక్షణమే నిధులు విడుదల కాకపోతే పనుల్లో జాప్యం పెరుగుతుందని, వర్షాలు ప్రారంభమైతే పనులు నిలిచిపోయే పరిస్థితి కూడా ఉంటుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.