Oct 02,2022 22:00

ఢిల్లీ : 'విండ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ వ్యాపార వేత్త తులసీ తాంతీ కన్నుమూశారు. 1995లో సుజ్లాన్‌ ఎనర్జీ అనే కంపెనీని స్థాపించి భారత పవన విద్యుదుత్పత్తి రంగంలో ఉన్న అవకాశాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తాంతీ (64) కన్నుమూశారు. ఆయనకు భార్య గీతా, కుమారుడు ప్రణవ్‌, కుమార్తె నిధి ఉన్నారు. గుండెపోటుతో ఆయన శనివారం సాయంత్రం మరణించినట్లు కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశం ముగించుకొని తిరిగొచ్చిన ఆయన పుణెలో ఉండగా ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు డ్రైవర్‌కు చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. అక్కడికి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తాంతీ మరణంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సహా పలువురు వ్యాపార ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ''తులసీ తాంతీ గొప్ప దార్శనికుడు. దేశ ఆర్థిక ప్రగతికి ఆయన ఎంతో కఅషి చేశారు. భారత సుస్థిరాభివఅద్ధి లక్ష్యాల సాధనలో తోడ్పాటునందించారు. ఆయన అకాల మరణం నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని మోడీ ట్వీట్‌ చేశారు.