Oct 03,2022 16:46
  • మలేషియా మహిళలపై 30పరుగుల తేడాతో గెలుపు
  • మహిళల ఆసియాకప్‌ టోర్నీ

ఢాకా: మహిళల ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీలో భారతజట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం వర్షం కారణంగా నిలిచిన ఈ మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిపై 30పరుగుల తేడాతో మలేషియాపై గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 181పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్‌ మేఘన(69), షెఫాలీ(46) తొలి వికెట్‌కు 116పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రీచా ఘోష్‌(33నాటౌట్‌), హేమలత(10నాటౌట్‌) చివర్లో బ్యాట్‌ ఝుళిపించారు. వినిఫ్రెడ్‌, షుబేదాకు రెండేసి వికెట్లు దక్కాయి. భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన మలేషియా జట్టు 5.2 ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 16పరుగుల చేసింది. ఆ తర్వాత భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయ్యింది. ఐసిసి నిబంధనల ప్రకారం టి20 ఫార్మాట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5ఓవర్లు పూర్తయిన పక్షంలో ఫలితాన్ని ప్రకటించవచ్చు.
స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్‌: మేఘన (సి)ఇజ్జతి (బి)వినీఫ్రెడ్‌ 69, షెఫాలీ (బి)డానియ, రీచా ఘోష్‌ (నాటౌట్‌) 33, నవ్‌గైర్‌ (సి)అరియనా (బి)సుహాద 0, రాధా యాదవ్‌ (సి)అజ్మి (బి)డురైసింగమ్‌ 8, హేమలత (నాటౌట్‌) 18, అదనం 15. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 181పరుగులు.
వికెట్ల పతనం: 1/116, 2/158, 3/158, 4/169
బౌలింగ్‌: షషా ఆమ్జీ 4-0-37-0, హషీమ్‌ 4-0-30-0, ఇస్మాయిల్‌ 4-0-21-0, నస్సా 3-0-37-0, వినీఫ్రెడ్‌ 3-0-36-2, ఎలైసా 1-0-8-0, డానియా సుహాద 1-0-9-2
మలేషియా ఇన్నింగ్స్‌: వినీఫ్రెడ్‌ (ఎల్‌బి)దీప్తి 0, జూలియ (బి)గైక్వాడ్‌ 1, ఎలైసా (నాటౌట్‌) 14, హంటర్‌ (నాటౌట్‌) 1, అదనం 0. (5.2ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 16పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/6
బౌలింగ్‌: దీప్తి శర్మ 3-0-10-1, గైక్వాడ్‌ 2-1-6-1, మేఘన 0.2-0-0-0

Womens-Asia-Cup-India-win-over-Malaysia