Aug 08,2022 16:17

హైదరాబాద్‌ : సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కెరీర్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన సినిమా 'పోకిరి'. ఈ సినిమాను ఆయన పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా స్పెషల్‌ షోస్‌ వేయాలని మహేష్‌ ఫ్యాన్స్‌ నిర్ణయించుకన్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ సినిమా స్పెషల్‌ షోస్‌ అరవై, డెబ్బై థియేటర్లలోనే వేయాలనుకున్నారు. తర్వాతర్వాత థియేటర్ల సంఖ్య 60-70 నుంచి ఏకంగా వరల్డ్‌వైడ్‌గా 175కి పెరిగింది. ఒక్క నైజాంలోనే 54కు పైగా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. అలాగే జంట నగరాల్లో పలు థియేటర్లలో ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ షోస్‌ ప్రదర్శనకు ప్లాన్‌ చేశారు. ఈ స్పెషల్‌ షోస్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆయన అభిమానులు మహేష్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కి విరాళం ఇస్తున్నట్టు తెలిపారు.
కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్‌ పూరీజగన్నాథ్‌ డైరెక్ట్‌ చేశారు. ఈ చిత్రం విడుదలై 16 ఏళుపూర్తిచేసుకున్నా.. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్‌, డైలాగ్స్‌, యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి.