Jun 23,2022 09:54

ప్రజాశక్తి నెల్లూరు: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గపు ఉప ఎన్నిక కోసం జరుగుతున్న పోలింగ్‌లో  మధ్యాహ్నం ఒంటి వరకు 44.14 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.

ఉదయం 11గం. కల్లా 24 శాతం ఓటింగ్‌ :  ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్‌ గట్టి బందోబస్తు నడుమ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల కల్లా 24.92 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. ఉదయం నుంచి పోలింగ్‌ బూత్‌లకు ఓటర్లకు క్యూలో ఉన్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న వైసిపి అభ్యర్థి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఉదయమే బారులు తీరి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో వైసిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి తన తల్లి మణి మంజరి ఇతర కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

212old