Jun 26,2022 20:46
  • 82,742 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
  • ఇది మంచికి ప్రజలిచ్చిన మద్దతు : సిఎం జగన్‌

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి, అమరావతి బ్యూరో : నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎనిుకల్లో వైసిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఘన విజయం సాధించారు. జనసేన మద్దతుతో పోటీకి దిగిన బిజెపి అభ్యర్థి భరత్‌కుమార్‌పై 82,742 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. స్థానిక ఇంజినీరింగ్‌ కాలేజిలో ఆదివారం ఉదయం జరిగిన కౌంటింగ్‌ ప్రక్రియలో ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డికి స్పష్టమైన ఆధిక్యత లభించింది. అయితే, లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామంటూ చేసిన ప్రకటనల లక్ష్యానిు మాత్రం ఆ పార్టీ నేతలు అందుకోలేకపోయారు. పోలింగ్‌ శాతం తగ్గడంతో పాటు బిజెపి అభ్యర్థికి టిడిపి, జనసేనల నుండి లభించిన సహకారం దీనికి కారణమని చెబుతునాురు. 1,37,038 ఓట్లు పోల్‌కాగా, విక్రమ్‌రెడ్డికి 1,02,074 (74.47శాతం) లభించాయి. రెండవ స్థానంలో నిలిచినిబిజెపి అభ్యర్థికి 19,332 ఓట్లు, బిఎస్‌పి అభ్యర్థి ఓబులేసుకు4,897 ఓట్లు లభించాయి. నోటాకునోటాకు4,179 (3.05 శాతం) ఓట్లు పోలయ్యాయి. 217 పోస్టల్‌ ఓట్లలో వైసిపికి 167, బిజెపికి21, బిఎస్‌సికి ఏడు లభించాయి. ఈ స్థానం నుండి గతంలో గెలిచిన మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణించడంతో ఇక్కడ ఉప ఎనిుక అనివార్యమైంది. వైసిపి తరపున గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి బరిలోకి దిగగా, మృతి చెందిన వారి కుటుంబసభ్యులపై పోటీ పెట్టకూడదను సంప్రదాయానిు పాటిస్తూ టిడిపి తన అభ్యర్థినినిలపలేదు. ప్రభుత్వం చేసిన మంచికి ప్రజలిచ్చిన మద్దతుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అభివర్ణించారు గౌతమ్‌రెడ్డికి నివాళిగా భారీ మెజార్టీ ఇచ్చారనిట్విట్టర్లో ఆయన పేర్కొనాురు. రాష్ట్రంలో ఏఎనిుకలు జరిగినా ప్రజాతీర్పు మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైపే వుంటుందనిరాష్ట్ర ప్రజలు మరోసారి చాటిచెప్పారనిరాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అనాురు. ఆత్మకూరు, బద్వేల్‌ ఉప ఎనిుకల్లో ప్రత్యర్థిగా పోటీలో నిలబడ్డ బిజెపికి డిపాజిట్‌లు కూడా రాలేదనిఅనాురు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రాష్ట్రంలో నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందుతునాుయనిఅందుకే ప్రజలు వైసిపి వెనుంటి వుంటునాురనిఅనాురు.

20 రౌండ్లలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు..
వైసిపి - 1,02,074
బిజెపి - 19,332
బిఎస్‌పి - 4,897
నోటా - 4,197
మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు : 217
వైసిపి : 167
బిజెపి : 21
బిఎస్‌పి : 7
ఇతరులు : 10
తిరస్కరించినవి : 9
నోటా : 3