Dec 08,2022 21:10

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలు కోసం కేంద్రంపై పోరాడలేకే వైసిపి సాకులు చెబుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. 'ఏ అవకాశమున్నా ఎపి ఉమ్మడిగానే ఉండాలని కోరతామంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ''పెళ్లయిన ఆరు మాసాలకు బాజాలు మోగించినట్లు'' ఉందన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది ఏళ్లుగా కేంద్రం ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై పోరాడకపోతే వైసిపికి రాజకీయ మనుగడ కష్టమవుతుందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారని అన్నారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ఎపికి దక్కాల్సిన హామీలు, నిధుల విషయాలపై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేతకాక ఇటువంటి కుంటిసాకులు వెదకుతోందన్నారు