
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ హత్య కేసులో భాస్కర్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.శుక్రవారం ఆయనకు రక్తపోటు పెరగడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం మళ్లీ జైలుకు తీసుకెళ్లారు. అవసరమైతే నిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.