Nov 25,2022 12:16

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్థానిక రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన వికలాంగులు క్రీడా పోటీలను జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వికలాంగ విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి పరుగు పందెం, వాలీబాల్‌, షాట్‌ పుట్‌ వంటి క్రీడా అంశాల్లో పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ... విభిన్న ప్రతిభావంతులుగా పిలవబడే వీళ్ళు నిజంగా ప్రతిభావంతులు అని అన్నారు. పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం షాట్‌ పుట్‌, పరుగు పందెం పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ శ్రావణి, జాయింట్‌ కలెక్టర్‌ అశోక్‌ , వికలాంగుల శాఖ ఎడి వికలాంగ క్రీడాకారులు పాల్గొన్నారు.