
వాషింగ్టన్ : లాస్ఏంజిల్స్లోని మౌంటెరీ పార్క్‌లో కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు హుయుకెన్ ట్రాన్ (72) వ్యాన్‌లో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. హుయుకెన్ ట్రాన్ ఓ వాహనంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చుట్టుముట్టారని.. వాహనం నుండి తుపాకీ పేల్చిన శబ్దం వినిపించిందని స్థానికులు వెల్లడించారు. కాల్పుల ఘటన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ షరీఫ్ రాబర్ట్ లూనా వివరించారు. ఈ ఘటనలో ఇతర అనుమానితులెవరూ లేరని, దాడికి గల కారణాలు తెలియలేదని చెప్పారు. విచారణ కొనసాగుతుందని అన్నారు. శనివారం రాత్రి మౌంటెరీ పార్క్‌లోని చైనీయులు లూనార్ న్యూఇయర్ పార్టీ చేసుకుంటుండగా ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మరణించగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.