
కాలువ పనులను ప్రారంభిస్తున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని వివిధ డివిజన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి శంకుస్థాపన చేశారు. 30వ డివిజన్లో రూ. 3 లక్షలతోనూ, 34వ డివిజన్లో రూ.6 లక్షలతోను కాలువల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మేయరు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కోలగట్ల వీరభద్ర స్వామి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ని లక్ష్మణరావు, జోనల్ ఇన్‌ఛార్జిలు కోలగట్ల కృష్ణారావు, బొద్దాన అప్పారావు, 34 వ డివిజన్ కార్పొరేటర్ బాలి పైడిరాజు, వైసిపి నాయకులు బాలి ప్రతాప్, రాజు తదితరులు పాల్గొన్నారు.