Feb 02,2023 02:31
పశు సంచార వైద్య సేవ వాహనాన్ని ప్రారంభిస్తున్న ఆమంచి కృష్ణమోహన్‌

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఇంకొల్లులో అభివృద్ధి పనులకు వైసిపి పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌ బుధవారం శ్రీకారం చుట్టారు. సినిమాహాలు రోడ్డులోని అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రూ.24 కోట్లతో ఇంకొల్లు నుంచి పర్చూరు వరకు 19 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టను న్నారు. ఇంకొల్లు సినిమాహాలు సెంటర్‌ బొమ్మల సెంటర్‌ నుంచి పర్చూరు రోడ్డులోని వై జంక్షన్‌ వరకు 10 మీటర్ల మేర సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం ఇంకొల్లు నుంచి పర్చూరు వరకు 19 కిలోమీటర్ల మేర 7 మీటర్ల తారు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్‌ మాట్లాడుతూ నాణ్యతతో పాటు వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సూచించారు. సినిమాహాలు సెంటర్‌లో పశు సంచార వైద్య సేవ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమంచి మాట్లాడుతూ మండలంలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, ఆక్రమణలు, రోడ్లు, తాగునీరు, ఆటోనగర్‌, ఇళ్ల స్థలాల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బండారు అనూష రాజ్‌కుమార్‌, సర్పంచ్‌ ఏజర్ల ప్రసన్న సైమన్‌, వైసీపీ మండల కన్వీనర్‌ బండారు ప్రభాకర్‌రావు, వైస్‌ ఎంపిపి తూమాటి చలమయ్య, కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ సుబాని, ఉప సర్పంచ్‌ సయ్యద్‌ లతీఫ్‌, ఆర్‌అండ్‌బి ఇఇ వి శ్రీనివాసరావు, డిఇ ఎం నరశింహులు, ఏఇఇ జి నాగార్జున, కాంట్రాక్టర్‌ ఎం రాఘవరావు, ధనుంజయరాజు, బండ్ల వెంకటసుబ్బారావు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.