Oct 14,2021 17:44

chekkulu estunna mp balashori, mla jogi ramesh

అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత
ఎంపి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే జోగి రమేష్‌
ప్రజాశక్తి- పెడన
రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. మండల పరిధిలోని నడుపూరు నుండి కొత్తపల్లి వరకు రూ.53.86 కోట్లతో వ్యయంతో నిర్మించనున్న ఆర్‌అండ్‌బి రోడ్డు, నడుపూరు నుండి ఆర్‌వి పల్లి గ్రామాల మధ్య రూ.1.30 కోట్ల ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధుల వ్యయంతో నిర్మించనున్న రహదారికి చేవెండ్ర పంచాయతీ పరిధిలోని మూలమరి గుంట నుండి పెదలంక వరకు రూ.12 కోట్లతో నిర్మించనున్న ఆర్‌అండ్‌బి రోడ్డుకు గురువారం వారు శంకుస్థాపన చేశారు. ఉరిమి, బల్లిపర్రులో ఏర్పాటు చేసిన ఆసరా రెండో విడత కార్యక్రమంలో పాల్గొని స్వయం సహాయక సంఘాల 790 గ్రూపులకు 7943 స్వయం సహాయసంఘాల సభ్యులకు రూ.6,79,88,739 చెక్కులను పంపిణీ చేశారు. మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గరికపాటి చారుమతి రామానాయుడు, ఎంపీపీ రాజులపాటి వాణి, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్‌ సూర్యప్రకాశరావు, పలు గ్రామాల సర్పంచులు కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.