Oct 02,2022 14:58

ప్రజాశక్తి-ఆస్పరి: మండల కేంద్రమైన ఆస్పరి ఆదివారం రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం చెందాడు. ఎస్.ఐ వరప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బత్తిని భీమలింగప్ప రెండవ కుమారుడు బత్తిని లసుమన్న (45)మృతి చెందినట్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు రైతు ఇంటి నుండి పొలానికి రెండు కాడెదూలతో వెళ్ళతుండగా పత్తికొండ రోడ్డు బాట లక్ష్మమ్మ దేవాలయం ముందు వెనుక నుండి ఆదోని నుంచి గుత్తికి వెళ్ళే లారీ ఢీకొనడంతో లసుమన్న, ఒక్క ఎద్దు అక్కడికక్కడే మృతి చెందారు. ఎద్దును కిలోమీటర్ల దూరం వరకు ఇడ్చుకొని వెళ్ళి భారత్ పెట్రోల్ బంక్ దగ్గర పడేసింది. మృతుడికి భార్య పార్వతి, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో కన్నీటి ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం లసుమన్న కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.