
జమ్ము : కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర జమ్ములో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం జమ్ములోని గారిసన్ పట్టణం నగ్రోటా నుండి ప్రారంభమైన జోడోయాత్రలో బాలీవుడ్ నటి, రాజకీయ నేత ఊర్మిళా మటోండ్కర్ పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఊర్మిళా, రాహుల్పాటు ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్, జమ్ముకాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వానీ, మాజీమంత్రి అబ్దుల్ హమీద్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు యాత్రలో పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆరు నెలలకే ఊర్మిళ 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం 2020లో శివసేనలో చేరారు. 2021 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లోని షేర్ ఎ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్న భారీ ర్యాలీతో ముగియనుంది.