Oct 02,2022 15:35

చెన్నై :   విక్రమ్‌, ఐశ్వర్యరాయ్,  త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌లతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.   తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 30న విడుదల చేశారు. ఈ చిత్రంపై  ప్రముఖ నటి మీనా స్పందించారు.  పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలో ఐశ్వర్యరాయ్  పాత్రను ఉద్దేశించి ఆమె ట్వీట్‌ చేశారు. ''నా డ్రీమ్‌ క్యారెక్టర్‌ నందిని ( ఐశ్వర్య రారు ) పాత్ర పోషించిన ఐశ్వర్య రాయ్ ని చూస్తే  అసూయగా ఉంది. నా జీవితంలో మొదటిసారి నేను అసూయపడుతున్నాను. పొన్నియిన్‌ సెల్వన్‌లో నటించిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా'' అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు.   సుమారు 90 చిత్రాల్లో నటించిన మీనా  తెెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రముఖ హీరోలందరితోనూ నటించారు.