Feb 27,2021 06:54

అది పోలేదు! ఇంకా వుంది..
మనలోనే దాక్కొనుంది..
ఎందరి ప్రాణాలో తీసింది
ఎన్నో బతుకుల్ని కాలరాసింది
ఇక్కడే కాపేసి కదలనంటోంది
ఎన్నో కుటుంబాలకు విషాద
యోగం పట్టించింది
వ్యవస్థను భ్రష్టుపట్టించి
అవ్యవస్థగా మార్చింది..ఇప్పుడు
మన నిర్లక్ష్యం అనే చిమ్మచీకటిలో
తెలివిగా మాటేసింది!
కొత్త ఎత్తుగడలతో మెల్లిగా
మళ్ళీ జనబాహుళ్యంలోకి
చొరబడి తన తఢాకా చూపుతోంది..
గతంలో దాని నెత్తుటి దాహానికి
జనం విలవిల్లాడిపోయేరు!
ఇల్లు దాటి కాలు బయటపెట్టడానికే
అదిరిపోయేరు.. వైద్యలు పోలీసు
పారిశుధ్య సిబ్బంది త్యాగాలు
వృధా కాకుండా ఉండాలంటే
మనం మరింత జాగరూకులమై
వ్యవహరించాలి..!
టీకాస్త్రం బ్రహ్మాస్త్రంలా వున్నా.. మాస్కులు, భౌతిక దూరాలు
లాంటి పాత ఆయుధాల్నెన్నడూ విడ్చిపెట్టరాదు!
మన క్రమశిక్షణే దానికి శిక్ష కావాలి!!
                                  * భీమవరపు పురుషోత్తం, సెల్‌ : 9949800253