
ప్రజాశక్తి - పెద్దాపురం స్థానిక సుధా కాలనీ శివారులో నూతనంగా నిర్మించిన ఆదిత్య విద్యాసంస్థల స్కూలును ఆదివారం హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి ప్రారంభించారు. అనంతరం ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో దొరబాబు మాట్లాడుతూ దేశంలోనే విద్యాసంస్థల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన ఆదిత్య విద్యాసంస్థల స్కూల్ పెద్దాపురం పట్టణంలో ఏర్పాటు చేయటం ఆనందదాయకమన్నారు. విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ బాలలందరినీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారానే దేశం పురోభివద్ధి సాధించడంతో పాటు అన్ని కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయన్నారు. మున్సిపల్ చైర్మన్ తులసి మంగతాయారు మాట్లాడుతూ పాఠశాల వాతావరణం నిండుగా తీర్చిదిద్దిన ఈ పాఠశాల విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నల్లమిల్లి శతి రెడ్డి, జెఎన్టియుకె అకడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీ కష్ణ, ఆప్కో మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు, సొసైటీ చైర్మన్ వీరంరెడ్డి నాని, డి.సాయిబాబా, జెడ్పిటిసి గవరసాన సూరిబాబు, కనపర్తి సీమదొర, పాఠశాల ప్రిన్సిపల్ డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.