Jan 23,2022 08:24

వాషింగ్టన్‌ : అధికారం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమయ్యారా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఓటింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకోవాలని అగ్ర సైనిక నేతను ఆదేశిస్తూ ఆయన లేఖ రాయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ముసాయిదా సిద్ధం చేసినప్పటికీ.. అధికారికంగా జారీ చేయలేకపోయానని తేలింది. దీంతో ఆయన పదవిపై ఎంత కాంక్షతో ఉన్నారో అర్ధమౌతుంది. 2021లో జనవరిలో క్యాపిటల్‌ హిల్స్‌పై జరిగిన దాడిపై విచారణ జరుపుతున్న హౌస్‌ కమిటీకి తాజాగా ముసాయిదా లేఖ లభించగా.. దాన్ని బహిర్గతం చేసింది.