Mar 28,2023 01:15
చీరలు పంపిణీ చేస్తున్న వేగేశన నరేంద్రవర్మ

ప్రజాశక్తి-కర్లపాలెం: ప్రతి ఇంటికీ తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యమని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామంలోని మల్లెల వారిపాలెంలో ఇంటింటికీ తెలుగుదేశం, మీ మాట- నా బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ విధానాలను వివరిస్తూ చీర, చేతి సంచి, కరపత్రాన్ని అందజేశారు. ముందుగా పెరలి గ్రామంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, తదనంతరం గ్రామస్తులు పూలతో, బాణసంచాలతో ఘన స్వాగతం పలుకగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోలాహలంగా సాగిన భారీ ర్యాలీగా వెళ్లి కార్యక్రమం ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు 3,000 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నాను. నా కృషిని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు ఇచ్చిన తరువాత అందరినీ కలుపుకుని కార్యక్రమాలు చేపడుతూ రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ తెలుగుదేశం పార్టీని చేరువ చేస్తూ ఒక అన్నగా, తమ్ముడిగా ఆడపడు చులకు చిరు కానుకను అందిస్తూ ముందుకు సాగుతున్నా. నన్ను మీ కుటుంబ సభ్యుడిలా భావించి అవకాశం ఇవ్వండి కలిసి బాపట్లను అభివృద్ధి చేసుకొందామని అన్నారు. పెరలి గ్రామం అంటే తెలుగుదేశం అడ్డాగా చేసుకునేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దళితులకు చాలా అన్యాయం జరిగింది. వారికి రావాల్సిన చాలా సంక్షేమ పథకాలు నిలిపివేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెరలి గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి అండగా నిలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ ఏపూరి భూపతిరావు, పార్లమెంటు ఉపాధ్యక్షులు నక్కల వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ షేక్‌ బాజీ, వసంతరెడ్డి, బొద్దుకూరి విజయ, కట్ట సుజాత, మద్దిబోయిన బుల్లయ్య, మండల టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.